Nagarjuna: ఈ ఉదయం నిద్ర లేవగానే ఓ వార్త విన్నాను..: అక్కినేని నాగార్జున

షార్ట్స్‌లో చూడండి
"ఈ ఉదయం నిద్ర లేవగానే ఓ వార్తను విన్నాను. న్యాయం జరిగింది" అని టాలీవుడ్ హీరో నాగార్జున వ్యాఖ్యానించారు. నేడు జరిగిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను నాగార్జున ఉంచారు.

కాగా, ఈ ఎన్ కౌంటర్ పై సినీ నటులు పలువురు స్పందించారు. "ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసోడు అయి ఉండాలి" అని నాని వ్యాఖ్యానించాడు. "అత్యాచారం చేసిన తరువాత ఎంత దూరం పారిపోతారు. థ్యాంక్యూ తెలంగాణ పోలీస్" అని రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది. "ఒకప్పుడు నేను మరణదండనకు వ్యతిరేకం. కానీ కొంతకాలం క్రితం నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. అత్యాచారాలకు పాల్పడితే ఉరి తీయాలి" అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Nagarjuna
News
Twitter
Encounte

More Telugu News