Rajanikant: వెంకన్న, అయ్యప్పల్లానే రజనీ కూడా... పొగుడుతూనే చురకలంటించిన భారతీ రాజా!

షార్ట్స్‌లో చూడండి
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ను పొగుడుతూనే చురకలంటించారు దర్శకుడు భారతీ రాజా. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి, శబరిమలలో అయ్యప్పలకు భక్తులను ఆకర్షించేలా ఎంతటి శక్తి ఉందో, రజనీకాంత్ కు అభిమానులను ఆకర్షించే శక్తి అంతలా ఉందని ఆయన అన్నారు.

తాజాగా, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఆయన, రజనీ తనకు మంచి మిత్రుడని చెప్పారు. కానీ, ఆయన రాజకీయాల్లోకి రావాలని భావించడాన్ని తాను వ్యతిరేకిస్తానని అన్నారు. ఇద్దరమూ మంచి స్నేహితులమే అయినా, సిద్ధాంతాల పరంగా ఒకరికి ఒకరం వ్యతిరేకమని అన్నారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనను రజనీకాంత్ విరమించుకుంటే, సంతోషించే వారిలో తాను కూడా ఉంటానని భారతీ రాజా వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Rajanikant
Bharati Raja
Politics

More Telugu News