Nagarjuna: నాగార్జున సరసన సందడి చేయనున్న కాజల్

షార్ట్స్‌లో చూడండి
ట్రెండ్ కి తగిన సినిమాలు చేయాలనే ఉద్దేశంతో 'మన్మథుడు 2' చేసిన నాగార్జునకి నిరాశే ఎదురైంది. నిర్మాతగా ఈ సినిమా ఆయనకి నష్టాలు తెచ్చిపెట్టడమే కాకుండా కొన్ని విమర్శలను కూడా మోసుకొచ్చింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న నాగార్జున తదుపరి సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.

నూతన దర్శకుడు సాల్మన్ చెప్పిన కథ నచ్చడంతో, పోలీస్ ఆఫీసర్ గా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి కాజల్ అయితేనే బెటర్ అనుకుని ఆమెను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని అంటున్నారు. గతంలో చరణ్ జోడీకట్టిన కాజల్ ఆ తరువాత చిరంజీవి సరసన మెరిసింది. అలాగే ఇంతకుముందు చైతూతో కలిసి 'దడ' చేసిన కాజల్, ఇప్పుడు నాగార్జునతో చేయనుండటం విశేషం.
Go Back to Shorts
Nagarjuna
Kajal Agarwal

More Telugu News