చిరంజీవిగారితో కలిసి నటించే అవకాశం అలా చేజారిపోయింది: సీనియర్ హీరోయిన్ ఆమని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవిగారితో కలిసి నటించే అవకాశం అలా చేజారిపోయింది: సీనియర్ హీరోయిన్ ఆమని

  • చిరంజీవిగారికి నేను వీరాభిమానిని
  • ఆ సినిమా కోసం అమెరికా వెళ్లడం మానుకున్నాను
  • తన ప్లేసులోకి నగ్మా వచ్చారన్న ఆమని
తెలుగులో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన నిన్నటితరం కథానాయికలలో 'ఆమని' ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .."హీరోయిన్ గా నేను బిజీగా వున్నప్పుడే చిరంజీవిగారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. 'రిక్షావోడు' సినిమాను వేరే దర్శకుడు చేయవలసింది. అప్పుడు ఆ దర్శకుడు ఒక హీరోయిన్ గా నన్ను .. మరో హీరోయిన్ గా సౌందర్యను అనుకున్నారు.

చిరంజీవిగారికి నేను వీరాభిమానిని .. ఆయనతో సినిమా అనేసరికి ఎగిరి గంతేశాను. ఒక షో కోసం అమెరికా వెళ్లవలసిన నేను మానుకుని మరీ డేట్స్ ఇచ్చాను. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ ఆ దర్శకుడు మారిపోయారు .. హీరోయిన్ గా నా ప్లేస్ లోకి నగ్మా వచ్చారు. ఆ సినిమా మిస్ అయినందుకు నేను చాలా బాధపడ్డాను .. నాకు అంత అదృష్టం లేదేమోనని సరిపెట్టుకున్నాను" అని చెప్పుకొచ్చారు.
Amani
Chiranjeevi

More Telugu News