మేం అడిగిన దానికి సమాధానం చెప్పలేని మంత్రి మైండ్ దొబ్బిందంటున్నాడు: దేవినేని ఉమ
- వైసీపీ మంత్రులపై ఉమ ఫైర్
- ఇదేనా మీ భాష అంటూ ఆగ్రహం
- జగన్ ది పైశాచిక ఆనందమని వ్యాఖ్యలు
"ఏం భాష ఇది... వైఎస్సార్ కాంగ్రెస్ భాష ఇదేనా... టీటీడీ విషయంలో దారుణంగా మాట్లాడుతున్నారు. ఎవరికివ్వాలి డిక్లరేషన్ అంటున్నారు. బూతుల మంత్రి కొడాలి నాని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. వైసీపీ మంత్రులు అహంకారంతో కొట్టుకుంటున్నారు. వెంకటేశ్వరస్వామిని పట్టుకుని ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. ఈ వ్యాఖ్యలకు నైతిక బాధ్యత తీసుకుని వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా ఇంకా ఎందుకు కులుకుతున్నారు?" అంటూ ఉమ నిప్పులు చెరిగారు.