ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు: వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి
- మొన్నటి ఎన్నికల్లో గెలవలేకపోయారు
- ఇక జమిలి ఎన్నికలొస్తే గెలుస్తారట
- మళ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీకి ఒక్క సీటూ రాదు
'మొన్నటి ఎన్నికల్లో గెలవలేకపోయారు, ఇక జమిలి ఎన్నికలొస్తే గెలుస్తారట' అంటూ బాబుపై సెటైర్లు విసిరారు. మళ్లీ ఎన్నికలు జరిగితే కనుక టీడీపీకి ఒక్క సీటు కూడా రాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా సహా రాయలసీమ జిల్లాల ప్రజలందరూ చంద్రబాబును ఛీత్కరించుకున్నారని, అయినా పట్టించుకోకుండా కడప జిల్లాలో మళ్లీ అడుగుపెట్టారని విమర్శించారు. 'ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రాంతం గురించీ అవమానకర రీతిలో మాట్లాడరు కానీ, నువ్వు (చంద్రబాబు), నీ దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) రాయలసీమను పదేపదే అవమానించినట్టు మాట్లాడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ఇలాంటి మాటలు మాట్లాడిన వీళ్లిద్దరూ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.