మీ జగన్ వసూలు చేసిన రూ. 1600 కోట్ల గురించి చెప్పండి విజయసాయిరెడ్డిగారూ: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
ఇసుక వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం చెంచాడు, వైసీపీ నేతలకు వచ్చిన ఆదాయం బిందెడని విమర్శించారు. ప్రభుత్వానికి రూ. 63 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్నారని... 30 లక్షల మంది కార్మికులను పస్తులు పెట్టి వైసీపీ నేతలు మెక్కేసిన 630 కోట్ల గురించి చెప్పాలని... సిమెంట్ కంపెనీల నుంచి జగన్ వసూలు చేసిన రూ. 1600 కోట్ల గురించి కూడా వివరించాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. విజయసాయిరెడ్డిగారు... డబ్బుపై మీకు, మీ జగన్ కు ఉన్న పిచ్చిని మరోసారి బయటపెట్టారని అన్నారు. ఇసుక ద్వారా రూ. 63 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్న మీకు.... మీ జగన్ చెత్త నిర్ణయాల వల్ల 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే... వారి గురించి కొంత బాధ కూడా లేదని విమర్శించారు.
Go Back to Shorts
Budda Venkanna
Vijayasai Reddy
Jagan
Telugudesam
YSRCP

More Telugu News