బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ ప్రమాదం బాధితురాలికి సాయం.. నెటిజన్ ట్వీట్ కు కేటీఆర్ స్పందన
Add ap7am to your home Screen

బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ ప్రమాదం బాధితురాలికి సాయం.. నెటిజన్ ట్వీట్ కు కేటీఆర్ స్పందన

  • ప్రమాదంలో కుబ్రా బేగం (23)కు తీవ్ర గాయాలు
  • గచ్చిబౌలిలోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స
  • ఆపరేషన్‌ కోసం రూ.5 లక్షలు అవసరం
  • సాయం చేస్తామని కేటీఆర్ హామీ
రెండు రోజుల క్రితం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కుబ్రా బేగం (23) తీవ్ర గాయాలపాలయింది. ఆమె గచ్చిబౌలిలోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమె బీటెక్ పూర్తి చేసిన అనంతపురం నుంచి హైదరాబాద్‌ వచ్చి ఓ హాస్టల్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆమె ఆపరేషన్‌ కోసం రూ.5 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. ఆమె తల్లిదండ్రులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ విషయాన్ని తెలుపుతూ ఒకరు తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసి, ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరారు. దీనిపై ఆయన వెంటనే స్పందించారు. ఆమె చికిత్సకు తప్పకుండా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై తాను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తో మాట్లాడానని, ఆ యువతి తల్లిదండ్రులను కలిసి అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పాలని కోరానని తెలిపారు.
KTR
Telangana
Road Accident

More Telugu News