విగ్రహానికి వెంటనే రంగులు మార్చేశారు... ట్విట్టర్ లో మరోసారి జనసేన ఆరోపణ

  • విజయనగరం జిల్లాలో గాంధీ విగ్రహానికి రంగులు అంటూ విపక్షాల ఆరోపణ
  • మండిపడిన వైసీపీ
  • అంతా ఫేక్ అంటూ స్పందించిన అధికార పక్షం
  • అప్రమత్తం అయిన రంగుల ప్రభుత్వం అంటూ జనసేన ప్రతిస్పందన
గాంధీ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారంటూ జనసేన, టీడీపీ ఆరోపిస్తుండగా, అంతా ఫేక్ ఫొటోలు అంటూ వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. దీనిపై జనసేన పార్టీ మరోసారి స్పందించింది. గాంధీ విగ్రహానికి కూడా రంగులు వేశారన్న ఆరోపణలు రాగానే వైసీపీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైందని, ఆ విగ్రహానికి హుటాహుటీన రంగులు మార్చేశారని ట్వీట్ చేసింది. అంతేకాదు, గాంధీ విగ్రహం తాజా ఫొటోలు పోస్టు చేసి తెల్లరంగు వేసినా ఇంకాస్త మిగిలిన వైసీపీ రంగును రౌండప్ చేసింది. జాతీయ జెండాకు రంగులను మార్చినట్టే గాంధీ విగ్రహం విషయంలోనూ వెనక్కి తగ్గారని పేర్కొంది.
Go Back to Shorts
YSRCP
Andhra Pradesh
Jagan
Jana Sena
Telugudesam
Pawan Kalyan
Chandrababu

More Telugu News