పేదల అభ్యున్నతి కోసమే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం: ఏపీ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి
- పాదయాత్రలో పేదలకిచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు
- చంద్రబాబు తన హయాంలో ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాశారు
- ఆయన వైఖరిమూలంగా సుమారు 6వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి
70శాతం దిగువ, ఎగువ, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు పంపిస్తున్నారన్నారు. పేదవారికి కూడా ఆశలుంటాయన్నారు. పాదయాత్రలో హామీలను నెరవేర్చే క్రమంలో పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు తగవన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రైవేటు పాఠశాలలకు కొమ్ముకాశారని ఆరోపించారు. సుమారు 6వేల పాఠశాలలను మూయించిన ఘనత చంద్రబాబుకు దక్కిందని ఎద్దేవా చేశారు.