ఆర్టీసీ కార్మికుల సమస్యపై సీఎం కేసీఆర్ కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
Add ap7am to your home Screen

ఆర్టీసీ కార్మికుల సమస్యపై సీఎం కేసీఆర్ కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

  • కార్మికుల వినతిని మన్నించి తిరిగి విధుల్లోకి తీసుకోండి
  • విధుల్లో చేరేందుకు కార్మికులు సిద్ధంగా వున్నారు
  • కేసీఆర్ తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నా 
టీఎస్సార్టీసీ కార్మికుల విషయమై సీఎం కేసీఆర్ కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. కార్మికుల వినతిని మన్నించి తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని, విధుల్లో చేరేందుకు కార్మికులు సిద్ధంగా వున్నారని అన్నారు. కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లో చేర్చుకోవాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నానంటూ వరుస ట్వీట్లు చేశారు.

నలభై రోజులకి పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నానని, తద్వారా ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఆపై సానుకూలంగా కార్మికుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా పవన్ కోరారు.
Tsrtc
cm
kcr
janasena
Pawan Kalyan

More Telugu News