ప్రభుత్వం భయపడుతోంది.. అందుకే సీఈసీపై పోరాటాన్ని తమపైకి మళ్లించుకుంది: సీజేపీ
Add ap7am to your home Screen

ప్రభుత్వం భయపడుతోంది.. అందుకే సీఈసీపై పోరాటాన్ని తమపైకి మళ్లించుకుంది: సీజేపీ

Cockroach Janata Party claims government is scared and diverted CEC protest towards themselves
  • సీఈసీకి వ్యతిరేక నిరసనను ప్రభుత్వం తమపైకి మళ్లించుకుంటోందని సీజేపీ ఆరోపణ
  • గత 72 గంటల్లో దేశంలో ఎమర్జెన్సీని మించిన అరాచకం చూశామన్న అశుతోష్ రంకా
  • మోదీ, అమిత్ షా ఆదేశాలతోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని విమర్శ
  • సీజేపీ వ్యవస్థాపకుడి కుటుంబ విషాదంలో ఢిల్లీ పోలీసుల తీరు అమానుషమని వ్యాఖ్య
  • తమ పోరాటానికి మద్దతిచ్చిన నలుగురు మాజీ ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న శాంతియుత నిరసనలను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఈ పోరాటాన్ని మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంగా మార్చుకుందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తీవ్రంగా ఆరోపించింది. ముందస్తు అరెస్టు కింద అదుపులోకి తీసుకున్న తర్వాత విడుదలైన కొన్ని గంటలకే, సీజేపీ సహ కన్వీనర్ అశుతోష్ రంకా ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా అశుతోష్ రంకా మాట్లాడుతూ, "గత 72 గంటల్లో దేశం తీవ్రమైన అరాచక పాలనను చూసింది. నిర్దేశిత ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకున్న వేలాది మందిని దేశవ్యాప్తంగా అదుపులోకి తీసుకున్నారు. నిన్న మమ్మల్ని విమానం నుంచి కిడ్నాప్ చేసినంత పని చేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, మేము మా తల్లిదండ్రుల నుంచి విన్న 1975 ఎమర్జెన్సీ కథలను కూడా ఈ 72 గంటల పరిణామాలు మించిపోయాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆయన ఆరోపించారు. 

"ఒక విషయం స్పష్టమైంది. ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ పోరాటాన్ని ప్రధాని మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంగా మార్చారు" అని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం, పూర్తిగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల కనుసన్నల్లోనే పనిచేస్తోందని, కేవలం బీజేపీని ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుటుంబంలో జరిగిన విషాదం పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై అశుతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అభిజీత్ నాయనమ్మ మరణవార్త తెలిసినప్పుడు కూడా ఢిల్లీ పోలీసులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని, కెమెరాలు, మైక్రోఫోన్లతో వచ్చి ఆ విషాదాన్ని కూడా ఒక ప్రదర్శనగా మార్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు. "తన తల్లిదండ్రులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, వారికి సులభంగా ఆందోళన కలుగుతుందని, అందుకే తన కజిన్‌తో మాట్లాడనివ్వాలని అభిజీత్ వేడుకున్నా ఢిల్లీ పోలీసులు కనికరించలేదు" అని రంకా తెలిపారు.

తాను తన నాయనమ్మ అంత్యక్రియల కోసం మహారాష్ట్రలోని సొంత ఊరికి వెళుతున్నానని, అయితే సీజేపీ వెనక్కి తగ్గదని, బెదిరింపులకు భయపడదని అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. అభిజీత్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుఃఖ సమయంలో తామంతా అతడికి అండగా నిలుస్తామని రంకా అన్నారు.

ఈ పోరాటంలో తమకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నేతలకు సీజేపీ కృతజ్ఞతలు తెలిపింది. "నలుగురు మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాణిక్ సర్కార్, పినరయి విజయన్ వీధుల్లోకి వచ్చి యువతతో కలిసి నిలబడటం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వారు చేస్తున్న పోరాటానికి నిదర్శనం. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు" అని రంకా పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ వంటి వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులను కూడా పోలీసులు అత్యంత క్రూరంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. "ఈ పోరాటం ఇప్పుడే మొదలైంది. దీనిని ఒక యుద్ధంగా మార్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.
Advertisement
Cockroach Janata Party
Ashutosh Ranka
Gyanesh Kumar CEC
Narendra Modi
Abhijeet Dipke
CJP Protests

More Telugu News