రణబాలి' చూశాక మన చరిత్ర గురించి మాట్లాడుకుంటారు: విజయ్ దేవరకొండ
- 'రణబాలి' గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందన్న విజయ్ దేవరకొండ
- చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ఈ చిత్రం అని వెల్లడి
- బ్రిటీష్ పాలనలోని కరవులు, దారుణాల నేపథ్యంతో ఈ సినిమా అని స్పష్టీకరణ
- రష్మికతో కెమిస్ట్రీ సినిమాకు మరింత ఎమోషనల్ డెప్త్ ఇచ్చిందన్న విజయ్
- రాజమౌళి గారితో సినిమా చేస్తే తప్ప తన చిత్రాలకు టికెట్ రేట్లు పెంచనని చమత్కారం
"‘రణబాలి’ కేవలం ఒక సినిమా కాదు, మన చరిత్రలో మరుగున పడిపోయిన ఒక ముఖ్యమైన అధ్యాయం. ఇది మన పూర్వీకులు పడిన కష్టాల కథ. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ మన సంస్కృతి, మన చరిత్ర గురించి మాట్లాడుకుంటారు. ఇది ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని, ఎమోషనల్ హైని ఇస్తుంది" అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం "రణబాలి". రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బ్రిటిషర్ల దోపిడీ, 80 లక్షల మంది మరణాలు
ఈ సినిమా వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని విజయ్ దేవరకొండ భావోద్వేగంతో వివరించారు. "చాలామంది ఇప్పటికీ బ్రిటిష్ వాళ్లు మన మంచికోసమే రైల్వే లైన్లు వేశారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన దేశ సంపదను, ధాన్యాన్ని, పత్తిని నౌకాశ్రయాలకు తరలించి దోచుకోవడానికే వాళ్లు ఆ పనులు చేశారు. 1876-78 మధ్య కేవలం మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చిన కరవు వల్లే 80 లక్షల మందికి పైగా ప్రజలు ఆకలితో చనిపోయారు. కరవు వస్తే మన రాజులు పన్నులు తగ్గించేవారు, కానీ బ్రిటిషర్లు మాత్రం రెట్టింపు పన్నులు వసూలు చేశారు. కట్టలేని వాళ్లను బానిసలుగా మార్చి రైల్వే లైన్లు, ప్రాజెక్టుల నిర్మాణంలో కఠోరమైన పనులు చేయించారు. పనిచేయలేని వాళ్లకు ఆకలి చావే గతి. ఈ నిజాలు తెలుసుకుంటే మనసు వికలమవుతుంది" అని అన్నారు. ఇలాంటి చారిత్రక తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే మన గతాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
జానపద వీరులే 'రణబాలి'కి స్ఫూర్తి
బ్రిటిషర్ల దురాగతాలను ఎదిరించిన ఎందరో వీరులు చరిత్రలో మరుగునపడిపోయారని, అలాంటి వారి కథలు జానపదాల రూపంలోనే బతికి ఉన్నాయని విజయ్ తెలిపారు. "దేశానికి స్వాతంత్ర్యం కావాలనే ఆలోచన కంటే ముందు, తమ ఊరిపై పెత్తనం చెలాయిస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న విదేశీయులను ఎదిరించిన వీరులెందరో ఉన్నారు. వాళ్లలో చాలామంది 30 ఏళ్లలోపే ప్రాణాలు అర్పించారు. ఆ వీరులే 'రణబాలి' చిత్రానికి స్ఫూర్తి. దర్శకుడు రాహుల్ అనంతపురంలోని ఒక జాతరలో పాడే జానపదాల ద్వారా ఈ కథకు ప్రేరణ పొందాడు. మా సినిమా కూడా అలాంటి ఒక జానపదంతోనే మొదలవుతుంది" అని వెల్లడించారు.
ఇదొక బాధ్యతాయుతమైన ప్రయత్నం
"పెళ్లి చూపులు" తర్వాత తాను పూర్తి సంతృప్తితో, ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా చూసుకుని విడుదల చేస్తున్న సినిమా "రణబాలి" అని విజయ్ పేర్కొన్నారు. "ఈ సినిమాను ఒక బాధ్యతగా భావించి రూపొందించాం. మేం ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి చారిత్రక కథలు వెలుగులోకి వస్తాయి. లేదంటే ఇలాంటి కథలను ఎవరూ ముట్టుకోవడానికి సాహసించరు. అందుకే ట్రైలర్‌లో కూడా అనవసరమైన హైప్ క్రియేట్ చేయకుండా, ఉన్నది ఉన్నట్లు జెన్యూన్‌గా చూపించాం. థియేటర్‌లో కూర్చున్న ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి లీనమైపోతారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉంటుందని, కథానుగుణంగానే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలిపారు.
రష్మికతో కెమిస్ట్రీ, టికెట్ ధరలపై కీలక నిర్ణయం
ఈ చిత్రంలో రష్మిక 'జయమ్మ' పాత్రలో నటిస్తోందని, తామిద్దరం కలిసి నటించడం వల్ల పాత్రలకు మరింత ఎమోషనల్ డెప్త్ వచ్చిందని అన్నారు. తన పాత్ర కోసం రాయలసీమ యాసను రెండు మూడు నెలల పాటు ప్రత్యేకంగా నేర్చుకున్నానని, పుట్టపర్తిలో చదవడం వల్ల ఇది కొంత సులభమైందని చెప్పారు. ఈ సందర్భంగా విజయ్ ఒక కీలక ప్రకటన చేశారు.
"కాలేజీ రోజుల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సినిమాలు చూడలేకపోయాను. ఆ బాధ నాకు తెలుసు. అందుకే 'రణబాలి' నుంచి నా ఏ సినిమాకూ టికెట్ ధరలు పెంచేది లేదు. ఒకవేళ రాజమౌళి గారితో సినిమా చేస్తే తప్ప, నా సినిమాలకు సాధారణ రేట్లే ఉంటాయి" అని స్పష్టం చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని, ఇది కేవలం వినోదం మాత్రమే కాదని, ఒక అనుభవమని విజయ్ ముగించారు.