Anjali Devi: తొలి సినిమాలో ఆ సీన్ చేయడానికి అంజలీదేవి చాలా ఇబ్బందిపడిందట

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై అలనాటి కథానాయికలలో అంజలీదేవి స్థానం ప్రత్యేకం. సన్నివేశానికి సహజత్వాన్ని తీసుకురావడం కోసం పాత్రలో ఆమె ఇమిడిపోయేవారు. అలాంటి అంజలీదేవిని గురించి తాజాగా సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

"అంజలీదేవి తొలి సినిమా 'గొల్లభామ' .. ఇది 1947లో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె 'మోహిని' అనే వ్యాంప్ పాత్రను పోషించారు. ఈ సినిమా అనుభవాలను గురించి ఒకసారి అంజలీదేవిగారు నాకు చెప్పారు. ఈ సినిమాలో ఆమె ఒక ముద్దు సన్నివేశంలో నటించవలసి వచ్చిందట. అప్పట్లో ముద్దు సన్నివేశంలో కనిపించడమంటే ఒక సాహసం చేసినట్టే. అప్పటికే వివాహమైన కారణంగా ఆ సీన్లో చేయడానికి అంజలీదేవి చాలా ఇబ్బందిపడ్డారట. దర్శకుడు సి.పుల్లయ్య .. సీన్ కి గల ప్రాధాన్యతను వివరిస్తూ నచ్చజెప్పడం వలన ఆమె ఆ సీన్ చేశారట. సినిమా విడుదలైన తరువాత ఆ సీన్ చూసి ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీలయ్యారని ఆమె నాతో అన్నారని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Anjali Devi

More Telugu News