గున్న ఏనుగును రక్షించినందుకు తొండం ఎత్తి కృతజ్ఞతలు తెలిపిన తల్లి ఏనుగు.. వీడియో వైరల్
- ఓ గుంతలో పడిపోయిన గున్న ఏనుగు
- రక్షించిన అటవీశాఖ సిబ్బంది
- తల్లి వద్దకు చేరిన గున్న ఏనుగు
సహాయక సిబ్బంది ప్రొక్లెయిన్‌తో గున్న ఏనుగును రక్షించారు. గున్న ఏనుగు బయటకు వచ్చి తల్లి ఏనుగును కలిసింది. మిగతా ఏనుగులు దానితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ సమయంలో గున్న ఏనుగు తల్లి ఏనుగు కాసేపు ఆగి, అటవీ అధికారులు, సిబ్బంది వైపు తిరిగి తొండం పైకెత్తి కృతజ్ఞతలు తెలిపింది. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలియరాలేదు.