ఆత్మహత్యకు ముందు కొత్త బట్టలు ధరించి, ఒకర్నొకరు చూసుకుని.... వృద్ధ దంపతుల విషాదాంతం!
- తెలంగాణలో ఘటన
- కొడుకు నిరాదరణ భరించలేకపోయిన వృద్ధ దంపతులు
- పురుగుల మందు తాగి బలవన్మరణం
ఎంతో ఆత్మాభిమానంతో బతికిన వారిద్దరూ ఇక బతకడం తమ వల్లకాదని నిర్ణయించుకున్నారు. తమ అంతిమ యాత్రకు అవసరమైన వస్తువులన్నీ ముందే సమకూర్చుకున్నారు. కొత్తబట్టలు ధరించి ఒకరినొకరు కడసారి చూసుకుని, ఆ ఆఖరుక్షణాల్లో కళ్లల్లో కాసింత ఆనందాన్ని నింపుకున్నారు. ఆపై పురుగుల మందు తాగేశారు. సాలయ్య దంపతుల ఆత్మహత్య కంటే వాళ్లు చనిపోయిన విధానం అందరినీ కలచివేసింది.