‘నిశ్శబ్దం’ వీడింది... అనుష్క కొత్త సినిమా టీజర్ వచ్చేసింది!
- దివ్యాంగురాలిగా నటిస్తున్న అనుష్క
- సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంగా సాగనున్న సినిమా
- త్వరలోనే థియేటర్లలోకి!
‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ నిర్మిస్తుండగా, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్, షాలినిపాండే, అంజలి, సుబ్బరాజు తదితరులు ముఖ్యమైన తారాగణం. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుందని నిర్మాత వెల్లడించారు.