'అల్లరి ప్రియుడు' ఫ్లాప్ కావడం ఖాయమన్నారు: రాఘవేంద్రరావు
- రాజశేఖర్ నే హీరోగా అనుకున్నాము
- ఇండస్ట్రీలో చాలా విమర్శలు వినిపించాయి
- ఆ సినిమా 25 వారాలు ఆడిందన్న రాఘవేంద్రరావు
ఈ సినిమా విడుదలైన తరువాత ఆంధ్ర నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ కాల్ చేశాడు. 'రాజశేఖర్ కి ఆ కాస్ట్యూమ్స్ ఏంటి .. ఆ పాటలేంటి .. ఆ స్టెప్పులేంటి .. మీకు ఏదో అయింది .. ఈ సినిమాతో దుకాణం మూసేయవలసిందే' అన్నాడు. ఆయన అలా అన్నందుకైనా ఆ సినిమా బాగా ఆడాలని దేవుణ్ణి కోరుకునేవాడిని. 2వ వారం నుంచి వసూళ్లు పుంజుకున్నాయి .. 25 వారాలపాటు ఆడింది. ఆ ఫంక్షన్ కి సంబంధించిన మొదటి ఇన్విటేషన్ కార్డు ఆయనకే పంపించాను" అని చెప్పుకొచ్చారు.