హాకీ నేపథ్యంలో సాగే కథతో 'A1 ఎక్స్ ప్రెస్'
- 'తెనాలి రామకృష్ణ'గా పలకరించనున్న సందీప్ కిషన్
- హీరోగా .. నిర్మాతగా మరో సినిమా మొదలు
- కథానాయికగా లావణ్య త్రిపాఠి
డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక సినిమా చేస్తున్నాడు. హాకీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. సందీప్ కిషన్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి 'A1 ఎక్స్ ప్రెస్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజునే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టారు. సందీప్ కిషన్ జోడీగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు. ఆమె కూడా ఈ సినిమాలో హాకీ ప్లేయర్ గా కనిపించనుండటంతో శిక్షణ తీసుకుంటోందట. హాకీ నేపథ్యంలో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.