బిగ్ బాస్ విజేత శ్రీముఖి?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో!
- తుది అంకానికి చేరుకున్న బిగ్ బాస్
- ఆదివారం గ్రాండ్ ఫినాలే
- టైటిల్ ను పట్టుకున్న శ్రీముఖి ఫొటో వైరల్
మరోవైపు ఈ సీజన్ విజేత శ్రీముఖి అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విజేత అంటూ పెట్టిన ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో బిగ్ బాస్ టైటిల్ ను అందుకున్న శ్రీముఖిని... హోస్ట్ నాగార్జున ఆప్యాయంగా హత్తుకున్నట్టు ఉంది. ఇందులో ఎంత వరకు నిజం అనే దాంట్లో క్లారిటీ లేనప్పటికీ... ఈ పోస్ట్ కు జనాల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. అసలు విజేత ఎవరో తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే.