తమిళ బిగ్ బాస్ షో విజేతగా తెలుగోడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ బిగ్ బాస్ షో విజేతగా తెలుగోడు!

  • బిగ్ బాస్-3 టైటిల్ గెలిచిన మలేసియా వాసి ముగెన్ రావు
  • గాయకుడిగా పేరుప్రఖ్యాతులు
  • ఆటుపోట్లు ఎదుర్కొని జీవితంలో నిలిచిన ముగెన్ రావు
తమిళ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా ముగెన్ రావు నిలిచాడు. ముగెన్ రావు మలేసియాకు చెందిన గాయకుడు. ముగెన్ రావు తెలుగు కుటుంబంలో పుట్టాడు. తండ్రి ప్రకాశ్ కృష్ణ నటుడు, గాయకుడు. తండ్రి బాటలోనే ముగెన్ రావు కూడా సింగర్ అయ్యాడు. అంతకుముందు హైస్కూల్ దశలో మాఫియా పట్ల ఆకర్షితుడై పక్కదారి పట్టినా ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో తండ్రితో పాటు కచేరీలు చేస్తూ గాయకుడిగా ఎదిగాడు.

మలేసియాలో ఉన్న తెలుగు, తమిళ, మలయాళ సమాజాల్లో ముగెన్ రావు ఓ సెలబ్రిటీ. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలోనూ వీడియో సాంగ్స్ చేసి ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. ఈ కారణంగానే ముగెన్ కు తమిళ బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చింది. మిగతా కంటెస్టెంట్ల కంటే మెరుగైన ప్రదర్శనతో బిగ్ బాస్ సీజన్ 3లో విజేతగా అవతరించాడు.
Bigg Boss
Mugen Rao
Tamil
Malaysia

More Telugu News