Chiranjeevi: చిరూ సరసన నాయికగా త్రిష?

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికగా త్రిష ఒక వెలుగు వెలిగింది. ఈ రెండు భాషల్లోనూ కొత్త కథానాయికల నుంచి పోటీ ఎక్కువ కావడంతో ఆమె వెనుకబడిపోయింది. అయితే ఆ మధ్య తమిళంలో వచ్చిన '96' మూవీ సూపర్ హిట్ కావడంతో ఆమెకి అక్కడ అవకాశాలు పుంజుకున్నాయి. అక్కడే కాదు ..ఇక్కడ కూడా త్రిష క్రేజ్ అలాగే వుంది.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి తాజా చిత్రంలో కథానాయిక పాత్ర కోసం త్రిషను అడుగుతున్నట్టుగా సమాచారం. చిరంజీవి తన 152వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం త్రిషను సంప్రదిస్తున్నారట. ఇది మామూలు కాంబినేషన్ కాదు గనుక ఆమె అంగీకరించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. గతంలో చిరంజీవి సరసన త్రిష 'స్టాలిన్' సినిమా చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Chiranjeevi
Trisha

More Telugu News