శకుని మామా! ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు రెండు దోమల బ్యాట్లు కొని తెచ్చుకో: విజయసాయిపై బుద్ధా సెటైర్లు
- గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందా?
- తుగ్లక్ జగన్ గ్రామాల్లోకి వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారు?
- శకుని మామా! మీరు ఢిల్లీ దాటి ఎందుకు రావట్లేదు?
దోమలు, ఎలుకల నివారణకు అంత ఖర్చా? అని హడావిడి చేశావు కదా, ఇప్పుడు రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వచ్చి ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కనుక ‘నువ్వు, మీ తుగ్లక్’ గ్రామాల్లోకి వెళితే ‘మీకు పండగే శకుని మామా!’ అని సెటైర్లు విసిరారు. అంగన్ వాడీ , ఆశా.. ఇలా అనేక మంది ఉద్యోగాలు తీసేసి, వైసీపీ కార్యకర్తలకు పంచేశామన్న సంతోషంలో ‘పండగ చేసుకుంటున్న నువ్వు, మీ తుగ్లక్ ఈ సమయంలో గ్రామాల్లో అడుగుపెడితే మీకు బడిత పూజ ఖాయం! కాస్త జాగ్రత్త శకుని మామా!’ అని బుద్ధా వెంకన్న చురకలంటించారు.