అనూహ్యంగా కోర్టుకు వచ్చి లొంగిపోయిన లలితా జ్యూయెలర్స్ చోరీ కేసు నిందితుడు!
- ఈ నెల 2 న దొంగతనం
- రూ. 13 కోట్ల విలువైన నగల చోరీ
- తిరువణ్ణామలై కోర్టులో లొంగిన సురేశ్
చిత్ర సీమతో సంబంధాలున్న సురేశ్, దొంగతనం అనంతరం ఓ హీరోయిన్ తో కలిసి శ్రీలంక పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇదే కేసులో సూత్రధారిగా భావిస్తున్న మురుగన్, ఏపీ లేదా తెలంగాణలో తలదాచుకుని ఉండవచ్చని భావించారు. ఈ నేపథ్యంలో తిరువణ్ణామలై జిల్లా చెంగమ్ కోర్టుకు వచ్చిన సురేశ్, న్యాయమూర్తి విఘ్నేశ్ ఎదుట లొంగిపోయాడు. అతనికి 14 రోజుల రిమాండ్ ను విధించారు న్యాయమూర్తి. అనంతరం సురేశ్ ను జైలుకు తరలించిన పోలీసులు, కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.