హీరోయిన్ గా నన్ను తప్పించేయమని రాజశేఖర్ గారు దర్శకుడితో చెప్పారట: జీవిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్ గా నన్ను తప్పించేయమని రాజశేఖర్ గారు దర్శకుడితో చెప్పారట: జీవిత

  • తెలుగులో నా తొలి సినిమా 'తలంబ్రాలు'
  • తమిళ సినిమా సెట్లోనే రాజశేఖర్ తో పరిచయం 
  • ఆ దర్శక నిర్మాతలు రాజశేఖర్ నే తీసేశారన్న జీవిత
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో జీవిత మాట్లాడుతూ, రాజశేఖర్ తో తనకి గల తొలి పరిచయాన్ని గురించి ప్రస్తావించారు. "తమిళంలో నేను చేసిన తొలి సినిమా మంచి హిట్ అయింది .. దాంతో అక్కడ నాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే తెలుగు సినిమా 'తలంబ్రాలు' కోసం ఎమ్మెస్ రెడ్డిగారు నన్ను తీసుకున్నారు. ఈ సినిమాలో యాంటీ హీరోగా రాజశేఖర్ చేస్తున్నట్టుగా చెప్పారు.

అంతకుముందే రాజశేఖర్ గారితో నాకు పరిచయం వుంది. ఒక తమిళ సినిమాలో  ఆయన హీరో .. నేను హీరోయిన్. మా ఇద్దరి కాంబినేషన్లో కొన్నిరోజుల పాటు షూటింగ్ సాగింది. ఒక రోజున ఆయన షూటింగుకి రాలేదు .. ఆయన ప్లేస్ లో రాధారవిగారు సెట్ కి వచ్చారు. ఏదో జరిగి ఉంటుందని అనుకున్నాను. హీరోయిన్ ను మార్చేయమని ఆ సినిమా దర్శక నిర్మాతలతో రాజశేఖర్ చెప్పారట. దాంతో వాళ్లు ఆయననే మార్చేశారు. ఆ తరువాత ఈ విషయాన్ని రాజశేఖర్ నాతో చెప్పి నవ్వేశారు" అని చెప్పుకొచ్చారు.
Jeevitha
Rajasekhar

More Telugu News