కీలక సన్నివేశాల చిత్రీకరణలో 'రొమాంటిక్'
- అనిల్ పాదూరి నుంచి 'రొమాంటిక్'
- మాఫియాతో ముడిపడిన ప్రేమకథ
- యూత్ లో పెరుగుతోన్న ఆసక్తి
ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాదులో ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మాఫియాతో ముడిపడిన ప్రేమకథగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. కీలకమైన పాత్రల్లో బాలీవుడ్ కి చెందిన మకరంద్ దేశ్ పాండే .. మందిరా బేడీ కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ సినిమాతో ఆకాశ్ కి హిట్ ఇవ్వాలనే పూరి ప్రయత్నం ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి.