గోపీచంద్ లో అప్పుడు ధైర్యం చూశాను .. ఇప్పుడు నమ్మకం చూస్తున్నాను: దర్శకుడు తిరు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోపీచంద్ లో అప్పుడు ధైర్యం చూశాను .. ఇప్పుడు నమ్మకం చూస్తున్నాను: దర్శకుడు తిరు

  • 'స్పై' చేపట్టే ఆపరేషన్ గా 'చాణక్య'
  • అక్కడ గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు
  • ఆ సమయంలో ఆయన చాలా ధైర్యంగా వున్నాడన్న 'తిరు'
యాక్షన్ చిత్రాలతో ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న గోపీచంద్, అదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'చాణక్య' ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు 'తిరు' ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "గోపీచంద్ తో ఒక యాక్షన్ మూవీ చేయాలనే కోరిక నాకు ఈ సినిమాతో తీరింది. ఒక 'స్పై' చేపట్టే ఆపరేషన్ గా ఈ కథ సాగుతుంది. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. జైపూర్ కి 250 కిలోమీటర్ల దూరంలో షూటింగు జరుపుతుండగా, ఛేజింగ్ సీన్ లో బైక్ పై నుంచి గోపీచంద్ పడిపోయారు.

ఫస్టు ఎయిడ్ చేయించి ఆయనను జైపూర్ తీసుకెళ్లాము. పెద్ద గాయమైనప్పటికీ బాధను భరిస్తూ ఆయన నిబ్బరంగానే వున్నారు. ఆ సమయంలో ఆయనలో ధైర్యం చూశాను. ఇప్పుడు ఈ సినిమా విడుదల సమయంలో ఆయనలో నమ్మకం చూస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే బలమైన నమ్మకంతో ఆయన వున్నారు" అని చెప్పుకొచ్చాడు.
Gopichand

More Telugu News