హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు
- మాస్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్
- హీరోగా రంగంలోకి దిగుతోన్న తమ్ముడు
- దర్శకుడిగా పవన్ సాధినేని
ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ .. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమాకి పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 1980 - 90 మధ్య కాలంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.