'కాంచన' హిందీ రీమేక్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కాంచన' హిందీ రీమేక్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

  • హిందీలోకి 'కాంచన' రీమేక్ 
  • దర్శకుడిగా లారెన్స్
  • హిజ్రా లుక్ తో అక్షయ్ కుమార్
ఆ మధ్య తెలుగు .. తమిళ భాషల్లో వచ్చిన 'కాంచన' భారీ విజయాన్ని నమోదు చేసింది. లారెన్స్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఆయన కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను హిందీలో 'లక్ష్మీ బాంబ్' టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా చేస్తోన్న ఈ సినిమాకి కూడా లారెన్స్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. కాళికాదేవి ఆలయంలో .. ఎర్రచీరతో హిజ్రా లుక్ తో అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. తన కుటుంబానికి అన్యాయం చేసిన ఒక వ్యక్తిని అంతం చేసే ప్రయత్నంలో భాగంగా 'కాంచన'లో లారెన్స్ నరసింహ స్వామి ఆలయంలోకి వెళతాడు. ఆ సన్నివేశాన్ని హిందీలో కాళికాదేవి ఆలయంలో ప్లాన్ చేసి వుంటారు. అందుకు సంబంధించిన పోస్టరే ఇది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Akshay Kumar

More Telugu News