ఆసక్తిని రేపుతోన్న 'చాణక్య' ట్రైలర్
- యాక్షన్ మూవీగా 'చాణక్య'
- కరాచీ నేపథ్యంలో సాగే కథ
- కీలకమైన పాత్రలో జరీన్ ఖాన్
ఈ సినిమాలో గోపీచంద్ .. 'రామకృష్ణ' అనే బ్యాంకు ఉద్యోగిగా, 'అర్జున్' అనే RAW ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. ఇది 'కరాచీ' నేపథ్యంలో మాఫియా చుట్టూ అల్లుకున్న కథ అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. జరీన్ ఖాన్ .. రాజేశ్ ఖట్టర్ .. అరుణ్ కుమార్ కనిపిస్తున్నారు. భారీస్థాయిలో నిర్మితమైన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.