మెగా హీరో కొత్త మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్
- తేజు తాజా చిత్రంగా 'ప్రతిరోజూ పండగే'
- కామెడీ ఎంటర్టైనర్ గా నెక్స్ట్ మూవీ
- అక్టోబర్ నుంచి సెట్స్ పైకి
బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ సినిమా ద్వారా 'సుబ్బు' దర్శకుడిగా పరిచయం కానున్నాడు. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకి 'సోలో బ్రతుకే సో బెటరు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. 'మనీ' సినిమాలో 'భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ .. సోలో బ్రతుకే సో బెటరు' అనే సాంగ్ ఒకప్పుడు ఎంత పాప్యులర్ అయిందో తెలిసిందే. కథానాయికగా నభా నటేశ్ నటించనున్న ఈ సినిమా, అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.