గోపీచంద్ తనయుడి పుట్టిన రోజు వేడుకల్లో తారాతోరణం... ప్రధాన ఆకర్షణగా ప్రభాస్, బన్నీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోపీచంద్ తనయుడి పుట్టిన రోజు వేడుకల్లో తారాతోరణం... ప్రధాన ఆకర్షణగా ప్రభాస్, బన్నీ

  • ఘనంగా గోపీచంద్ చిన్నకొడుకు పుట్టినరోజు
  • హాజరైన టాలీవుడ్ నటులు, దర్శకులు
  • వియాన్ కు ఆశీస్సులు అందజేసిన ప్రభాస్, బన్నీ
టాలీవుడ్ హీరో గోపీచంద్ చిన్న కుమారుడు వియాన్ తొలి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వియాన్ తో గోపీచంద్ దంపతులు నిల్చుండగా, అతిథులు ఒక్కొక్కరుగా వచ్చి విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రభాస్, అల్లు అర్జున్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరిరువురు గోపీచంద్ కు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా, ప్రభాస్, గోపీచంద్ ప్రాణస్నేహితులుగా చెప్పుకుంటారు. ఇక ఈ బర్త్ డే వేడుకలకు వచ్చిన తారలందరూ వియాన్ తో ఫొటోలకు పోజులిచ్చారు.

టాలీవుడ్ హీరోలు రామ్, విష్ణు మంచు, దర్శకులు బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, తేజ, సంపత్ నంది తదితరులు వియాన్ కు ఆశీస్సులు అందజేశారు. హీరో గోపీచంద్ కు 2013లో సీనియర్ నటుడు శ్రీకాంత్ మేనకోడలు రేష్మాతో వివాహం జరిగింది. గోపీచంద్, రేష్మా దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పేరు విరాట్ కృష్ణ కాగా, రెండో కుమారుడు వియాన్.
Gopichand
Prabhas
Allu Arjun
Tollywood

More Telugu News