విజయ్ దేవరకొండ బాటలో సాయిధరమ్ తేజ్.. ‘సేవ్ నల్లమల’ ఉద్యమానికి మద్దతు!
- ఎక్కడో ఉన్న అమెజాన్ కార్చిచ్చు గురించి బాధపడ్డాం
- మరి మనం ఇక్కడ చేస్తున్నది ఏంటి?
- రండి.. మన ప్రకృతిని కాపాడుకుందాం
‘ఎక్కడో ఉన్న అమెజాన్ అడవులు కాలిపోతుంటే మనం బాధపడ్డాం. మరి మనం ఇప్పుడేం చేస్తున్నాం? రండి.. మన ప్రకృతిని కాపాడుకుందాం. సేవ్ నల్లమల’ అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాలో నటిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.