Ajay Bhupathi: సెన్సేషనల్ స్టార్ తో అజయ్ భూపతి మూవీ

షార్ట్స్‌లో చూడండి
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'ఆర్ ఎక్స్ 100' మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'మహా సముద్రం' టైటిల్ తో ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాను రవితేజతో రూపొందించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నాడు. దాంతో ఈ కథ చైతూ దగ్గరికి వచ్చినట్టుగా ప్రచారం జరిగింది.

తాజాగా ఓ సెన్సేషనల్ స్టార్ హీరోతో అజయ్ భూపతి సినిమా ఖరారైపోయింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన ఈ సినిమా చేయనున్నాడు. భవ్య క్రియేషన్స్ వారే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తాము నిర్మించనున్న సినిమాలో ఒక సెన్సేషనల్ స్టార్ హీరో నటించనున్నట్టు ప్రకటించారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
Go Back to Shorts
Ajay Bhupathi

More Telugu News