మాజీ ఎమ్మెల్యే చింతమనేని న్యాయవాది అరెస్టు

  • అదుపులోకి తీసుకునే సందర్భంలో స్వల్ప ఉద్రిక్తత
  • మహిళా పోలీసు సిబ్బందిని నిర్బంధించారని కేసు
  • నిన్న చింతమనేని అరెస్టు సందర్భంగా ఘటన
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌ను నిన్న అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఈరోజు ఆయన న్యాయవాదిని కూడా అరెస్టు చేశారు. చింతమనేని అరెస్టు సందర్భంగా ఆయన ఇంటి వద్ద గస్తీ కోసం వెళ్లిన మహిళా పోలీసు సిబ్బందిని నిర్బంధించి విధులకు ఆటంకం కలిగించారని చింతమనేని న్యాయవాది శ్రీనివాసబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో న్యాయవాది ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు శ్రీనివాసబాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళితులను దూషించిన కేసులో అరెస్టయిన చింతమనేనికి కోర్టు ఈనెల 25వ తేదీ వరకు రిమాండ్‌ విధించడంతో ఆయనను జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
denduluru
Chinthamaneni Prabhakar
layer
arrest

More Telugu News