సంజూ శాంసన్ పెద్ద మనసు.. మ్యాచ్ ఫీజు మొత్తం గ్రౌండ్ సిబ్బందికి ఇచ్చేసిన క్రికెటర్!
- తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా-ఏతో మ్యాచ్
- వర్షం పడ్డా మైదానాన్ని మ్యాచ్ కు సిద్ధం చేసిన సిబ్బంది
- సంజూ విజృంభణతో విజయం సాధించిన భారత్
కేవలం 20 ఓవర్లే జరిగిన ఈ మ్యాచ్ లో సంజూ కేవలం 48 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. దీంతో భారత్-ఏ జట్టు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కేవలం 168 పరుగులకే కుప్పకూలింది. దీంతో మైదానం సిబ్బంది వల్లే ఈ మ్యాచ్ సాధ్యమయిందని అభిప్రాయపడ్డ సంజూ శాంసన్, తనకు మ్యాచ్ ఫీజుగా అందే రూ.1.50 లక్షలను మైదానం సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించేశారు. కాగా, సంజూ నిర్ణయంపై పలువురు క్రికెట్ ప్రేమికులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.