'అంధాదున్' తెలుగు రీమేక్ .. తెరపైకి ఇద్దరు దర్శకుల పేర్లు
- హిందీలో హిట్ కొట్టిన 'అంధాదున్'
- నితిన్ సొంత బ్యానర్ కి రీమేక్ రైట్స్
- వచ్చే ఏడాది సెట్స్ పైకి
ఈ సినిమాకి హరీశ్ శంకర్ గానీ .. సుధీర్ వర్మ గాని దర్శకత్వం వహించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ రీమేక్ విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఫైనల్ గా ఏ దర్శకుడిని సెట్ చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం నితిన్ 'భీష్మ' .. 'రంగ్ దే' సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత 'అంధాదున్' రీమేక్ షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది.