జగన్ విన్నపం పట్ల స్పందించని కేంద్రం... తెలంగాణకే స్టీఫెన్ రవీంద్ర
- స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తెచ్చుకోవాలని భావించిన జగన్
- అమిత్ షాను నేరుగా కలిసి విన్నవించిన సీఎం
- నిన్న తెలంగాణలో విధుల్లో చేరిన రవీంద్ర
ఈ నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జగన్ నేరుగా కలిసి... స్టీఫెన్ రవీంద్ర బదిలీ అంశాన్ని ప్రస్తావించారు. పరిశీలిస్తామని అమిత్ షా హామీ కూడా ఇచ్చారు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇన్ని రోజులు సెలవులో గడిపిన రవీంద్ర... ఈ సారి సెలవును పొడిగించుకోకుండా... నిన్న తిరిగి తెలంగాణలో తన విధుల్లో చేరారు. హైదరాబాద్ రేంజ్ ఐజీగా బాధ్యతలను స్వీకరించారు.