హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అనుష్క.. 'ఇంకా ఇలాగే ఉందా?' అంటూ నెటిజన్ల ఆశ్చర్యం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అనుష్క.. 'ఇంకా ఇలాగే ఉందా?' అంటూ నెటిజన్ల ఆశ్చర్యం!

  • 'సైజ్ జీరో' చిత్రం కోసం బరువు పెరిగిన అనుష్క
  • ఆపై తగ్గించుకునేందుకు ప్రయత్నాలు
  • ఇంకా తగ్గలేదంటున్న నెటిజన్లు
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లోనూ, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి, టాప్ హీరోయిన్ గా ఎదిగి, ఇప్పుడు అడపా దడపా కనిపిస్తున్న అనుష్క, తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కగా, ఆమె ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. అనుష్క లుక్ అసలు బాగాలేదని, ఆమె గ్లామరస్ గా కనిపించలేదని, లావు ఇంకా తగ్గలేదని కామెంట్స్ వస్తున్నాయి.

'సైజ్ జీరో' సినిమా కోసం విపరీతంగా లావెక్కిన అనుష్క, ఆపై బరువు తగ్గేందుకు ఎంతగా శ్రమించినా, మునుపటి లావణ్యాన్ని పొందలేకపోయిందన్న కామెంట్లు వినిపించాయి. బరువు తగ్గేందుకు ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇటీవల కాస్తంత స్లిమ్ అయ్యానని చెబుతూ, ఓ ఫోటో షూట్ ను కూడా అనుష్క విడుదల చేసింది. ప్రస్తుతం ఈ భామ 'సైలెన్స్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలోనూ ఆమె లుక్ నిరాశ పరుస్తుందనే అంటున్నారిప్పుడు ఫ్యాన్స్.
Anushka
Airport
Slim

More Telugu News