ఆ గొడుగుతో నానా బాధలు పడ్డాను: నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్
Add ap7am to your home Screen

ఆ గొడుగుతో నానా బాధలు పడ్డాను: నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్

  • 'జయం మనదేరా' షూటింగ్ కోసం యూరప్ వెళ్లాము 
  • అక్కడ ఓ వెరైటీ గొడుగు కొన్నాను 
  • తరచూ మరిచిపోయి టెన్షన్ పడేవాడినన్న ఎల్బీ
ఎల్బీ శ్రీరామ్ మంచి రచయిత .. అంతకుమించి గొప్ప నటుడు. ఎక్కువగా ఆయన హాస్య పాత్రలను పోషించినా, కనీళ్లు పెట్టించిన పాత్రలు కూడా వున్నాయి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఒక సరదా సంఘటనను గురించి ప్రస్తావించారు.

'జయం మనదేరా' షూటింగు కోసం యూరప్ వెళ్లాము. అక్కడ ఇరవైరోజుల పాటు షూటింగు. తరచు లొకేషన్స్ మార్చేస్తూ వుండేవాళ్లు. అక్కడికి వెళ్లిన రోజునే ఒక షాపులో నాకు ఒక వెరైటీ గొడుగు కనిపించడంతో వెంటనే కొనేశాను. ఇక అప్పటి నుంచి ఆ గొడుగును కాపాడుకోవడమే నా పని అయిపోయింది.

ఒక్కోసారి గొడుగును మరిచిపోయి బాధపడుతూ వుంటే, 'దీని కోసమేనా మీరు టెన్షన్ పడుతున్నది' అంటూ అలీ తెచ్చిఇచ్చేవాడు. అలా చాలాసార్లు జరిగింది. చివరికి ఇండియాకి వచ్చిన తరువాత ఇంటికి చేరుకొని చూస్తే గొడుగు లేదు. అంతలో అలీ కాల్ చేసి, సార్ గొడుగు కోసం కంగారు పడకండి .. మా డ్రైవర్ తో పంపించాను తీసుకోండి' అన్నాడు. అలా ఆయన నా గొడుగును కొట్టేస్తూ కాపాడాడు' అంటూ నవ్వేశారు.
L.B. Sriram
Ali

More Telugu News