'సాహో' చిత్రం ఫలితంపై కృష్ణంరాజు అర్ధాంగి శ్యామలాదేవి వ్యాఖ్యలు
- ఐమ్యాక్స్ లో 'సాహో' వీక్షించిన శ్యామలాదేవి
- గురువారం రాత్రి నుంచే పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయని వెల్లడి
- ప్రభాస్ నమ్మకాన్ని సుజీత్ నిలబెట్టాడంటూ కితాబు
గురువారం రాత్రి నుంచే 'సాహో'పై పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయని, హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉందంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల నుంచి మంచి వార్తలే వింటున్నామని, సాహో ఫలితంపై తాము చాలా ఆనందంగా ఉన్నామని వెల్లడించారు. ప్రీమియర్ షోలు చూసినవాళ్లు ఫోన్లు చేసి సినిమా బాగుందని చెబుతున్నారని, ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని సుజీత్ నిలబెట్టుకున్నాడని పేర్కొన్నారు. ప్రభాస్ ఓ అంతర్జాతీయ స్థాయి హీరో అయినా, చిన్న దర్శకుడు సుజీత్ కు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని అన్నారు.