జగన్ గారూ.. బిల్డర్లపై ఇప్పుడు 'J-ట్యాక్స్’ విధిస్తే ఎలాగండీ.. ఇంతకూ మీ వాటా ఎంత?: నారా లోకేశ్
- జగన్ దయతో ఏపీలో ఇసుక దొరకడం లేదు
- బిల్డర్లు ఇబ్బంది పడుతున్నారు.. కార్మికులు పస్తులతో పడుకుంటున్నారు
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత
వైసీపీ నేతలు అనధికారంగా లక్షల రూపాయల మేర జే-ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. ఇందులో తన వాటా ఎంతో జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేశ్ ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ట్వీట్ కు జతచేశారు.