'మన్మథుడు 2' కోసం 24 కోట్లు ఖర్చు అయిందట
- నాగ్ నుంచి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- అంతకంతకీ పెరుగుతోన్న అంచనాలు
- ఆగస్టు 9వ తేదీన విడుదల
ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ కారణంగా థియేట్రికల్ బిజినెస్ భారీస్థాయిలోనే జరుగుతుందని అంటున్నారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాగార్జునకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.