Andhra Pradesh: మరి, మా నాయకుడిపై ఇంత సీరియస్ పోస్టింగ్ చేసిన వారిని అరెస్ట్ చేయరా?: జగన్ కు వర్ల ప్రశ్న

షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫొటోకు దండ వేసి, బొట్టు పెట్టిన పోస్టింగ్స్ పై ఆ పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయమై నిన్న విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వర్ల రామయ్య ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘అయ్యా! మీపై చిన్న పోస్టింగ్ సోషల్ మీడియాలో పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నారు. మరి, మా నాయకుని మీద ఇంత సీరియస్ పోస్టింగ్ పెట్టిన వారిని అరెస్ట్ చేయరా? సమ న్యాయం చెయ్యండి. పోలీసులను అదేశించండి’ అని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
varla
cm
jagan

More Telugu News