'దొరసాని'లో ఆ సీన్ తీస్తుండగా జీవితగారు కాల్ చేశారు: దర్శకుడు కేవీఆర్ మహేంద్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'దొరసాని'లో ఆ సీన్ తీస్తుండగా జీవితగారు కాల్ చేశారు: దర్శకుడు కేవీఆర్ మహేంద్ర

  • జీవితా రాజశేఖర్ గార్లకి ముందుగానే స్క్రిప్ట్ వినిపించాను 
  • వాళ్లిద్దరూ చాలా ఫ్రొఫెషనల్ గా ఆలోచిస్తారు
  • ఆ సీన్ విషయంలో జీవితగారికి భరోసా ఇచ్చానన్న మహేంద్ర      
కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'దొరసాని' సినిమాకి ప్రశంసలు దక్కాయి. నిర్మాతలకి ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ .. "ఈ సినిమాలో శివాత్మిక .. ఆనంద్ దేవరకొండ మధ్య 'కిస్' సీన్ ఒకటి వుంది. ఆ సీన్ ఉంటుందని నేను స్క్రిప్ట్ చదివి వినిపించేటప్పుడే చెప్పాను.

జీవితగారు - రాజశేఖర్ గారు ఇద్దరు కూడా ప్రొఫెషనల్ గానే ఆలోచిస్తారు.  అందువలన వాళ్లేమీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. కాకపోతే ఈ సీన్ కి నేను ఏ యాంగిల్ పెడతాను .. ఎలా డీలా చేస్తానా అనే ఒక సందేహం జీవితగారికి ఉండేది. అందువల్లనే ఆ సీన్ ను ఆ రాత్రికి తీస్తామనగా, ఆ సాయంత్రం ఆమె నాకు కాల్ చేశారు. అప్పుడు నేను 'మేడమ్ మీరు కంగారు పడకండి .. మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలా డీల్ చేస్తానో అలా డీల్ చేస్తానని ఆమెకి నేను భరోసా ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు.
KVR Mahendra

More Telugu News