తుగ్లక్ పాలన అంటే టక్కున గుర్తుకువచ్చేది చంద్రబాబు పరిపాలనే!: వైసీపీ నేత జోగి రమేశ్
- రాజధాని పేరుతో అంతర్జాతీయ కుంభకోణం చేశారు
- భారీస్థాయిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు
- బాబువల్లే ప్రపంచబ్యాంక్ లోన్ వెనక్కి వెళ్లిపోయింది
- విజయవాడలో మీడియాతో వైసీపీ ఎమ్మెల్యే
టీడీపీ అధినేత తీరువల్లే ప్రపంచబ్యాంక్ రుణం వెనక్కి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఏపీలో తీవ్రమైన ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’కు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. తుగ్లక్ పాలన అనగానే టక్కున చంద్రబాబు పరిపాలనే గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, లోకేశ్ ఇళ్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.