ఒక కెమెరా మెన్ నేను కోతిలా వున్నానని అన్నాడు: నటుడు ఆదిత్య ఓమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక కెమెరా మెన్ నేను కోతిలా వున్నానని అన్నాడు: నటుడు ఆదిత్య ఓమ్

  • విలన్ గా ట్రై చేయమన్నారు 
  • తెలుగులో నటుడిగా నిలబడాలి 
  • హిందీలో దర్శకుడిని కావాలని వుందన్న ఆదిత్య ఓమ్
'లాహిరి లాహిరి లాహరి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆదిత్య ఓమ్ చేరువయ్యాడు. ఆ సినిమాలో తన అల్లరితో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ, అవి ఆయనను నిలబెట్టలేకపోయాయి.

ఈ కారణంగా తెలుగు తెరకి దూరమైన ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "చిత్రపరిశ్రమలోకి నేను ఎంటరైనప్పుడు విలన్ గా ట్రై చేయమని చాలామంది చెప్పారు. నా రూపాన్ని గురించి కామెంట్ చేసిన వాళ్లు కూడా వున్నారు. తొలి సీరియల్ చేయడానికి వెళ్లినప్పుడు, 'ఇతన్ని కెమెరాలో నుంచి చూస్తుంటే ఒక కోతిలా కనిపిస్తున్నాడు .. తీసేద్దాం సార్' అని ఒక కెమెరామెన్ దర్శకుడితో చెప్పాడు. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ప్రస్తుతం హిందీలో దర్శకుడిగాను .. తెలుగులో నటుడిగాను నిలబడాలనే ఉద్దేశంతో వున్నాను" అని చెప్పుకొచ్చాడు. 
Adithya Om

More Telugu News