Tollywood: అమెరికాకు పోతున్న నటుడు శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటుడు శివాజీని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలంద మీడియా కేసులో శివాజీపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు అతని కోసం కొన్ని రోజులుగా గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు పోయేందుకు శివాజీ యత్నించగా, సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు

అనంతరం సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. శివాజీ శంషాబాద్ నుంచి అమెరికాకు  పోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. కానీ గతంలోనే శివాజీపై లుకౌట్ నోటీసులు జారీచేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. దీంతో శివాజీని అదుపులోకి తీసుకున్నామనీ, విచారిస్తున్నామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Tollywood
sivaji
arrest
actor
alanda
tv9

More Telugu News