'దొరబాబు' షూటింగులో శ్రీహరిగారు నన్ను కొట్టారు: నటి లతాశ్రీ
Add ap7am to your home Screen

'దొరబాబు' షూటింగులో శ్రీహరిగారు నన్ను కొట్టారు: నటి లతాశ్రీ

  • అరకు వాటర్ ఫాల్స్ దగ్గర షూటింగ్ 
  • లోయలోకి జారిపోయాను
  • శ్రీహరి గారు నా ప్రాణాలు కాపాడారు  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో లతాశ్రీ మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "శోభన్ బాబుగారు హీరోగా 'దొరబాబు' సినిమా షూటింగు 'అరకులోయ'లో జరుగుతోంది. ఆ సినిమాలో శ్రీహరి విలన్. అరకు వాటర్ ఫాల్స్ లో ఒక సీన్ చిత్రీకరిస్తున్నారు. ఆ సీన్లో శ్రీహరిగారు కూడా వున్నారు.

కొంచెం వెనక్కి .. కొంచెం వెనక్కి అని కెమెరామెన్ చెబుతుండటంతో నేను వెనక్కి వెళ్లిపోతున్నాను. వెనక లోయ ఉందని నేను చూసుకోలేదు .. జారిపోయాను. లోయలో నుంచి ప్రవాహంలోకి నేను జారిపోతుండగా శ్రీహరి గారు దూకేశారు. ఆయనకి నా జుట్టు దొరికింది. అలాగే నన్ను గట్టిగా పట్టుకుని ఆయన పైకి తీసుకొచ్చారు. 'వెనకా ముందు చూసుకోవలసిన పనిలేదా' అంటూ లాగిపెట్టి కొట్టారు. అంతమందిలో కొట్టినందుకు అప్పుడు అలిగానుగానీ .. ఆయన నా ప్రాణాలు కాపాడారు" అని చెప్పుకొచ్చారు.
lathasri
ali

More Telugu News