కోహ్లీతో నటి ఊర్వశీ రౌతాలా... అనుష్క ఎక్కడుందని అడుగుతున్న నెటిజన్లు!
- పాక్ తో మ్యాచ్ తరువాత కోహ్లీ విగ్రహంతో ఫొటో
- షేర్ చేయడంతో వైరల్
- కామెంట్లతో నిండిపోయిన సోషల్ మీడియా
"అనుష్కా నువ్వు ఎక్కడ ఉన్నావో?" అని ఒకరు "నీ ఫోన్ చూసుకో" అని ఇంకొకరు, అనుష్కకు దిగులు ప్రారంభమైందని మరొకరు ఇలా కామెంట్లతో వీరి సోషల్ మీడియా ఖాతాలు నిండిపోతున్నాయి. ఇక అసలు వాస్తవం ఏంటో తెలుసా? ఊర్వశి కౌగిలించుకున్నది విరాట్ కోహ్లీని కాదు. ఆయన మైనపు విగ్రహాన్ని మాత్రమే. విగ్రహాన్ని కౌగిలించుకున్న ఊర్వశి, దాని బ్యాక్ గ్రౌండ్ ను మార్ఫింగ్ చేసి ఫొటోను పోస్ట్ చేసింది. దీనిపైనే ఈ రగడంతా. అదీ సంగతి.